Monday, April 30, 2012

తెలుగుదేశం పార్టీలో కోవర్టులు, ఊసరవెల్లులు, రాజకీయ వ్యభిచారులు నందమూరి 'హరికృష్ణ' & కో


తెలుగు దేశం పార్టీని ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైంది, ఏవైనా అనుకోని పరిణామాలు జరిగితే తప్ప ఎన్నికలు రావటానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రభుద్దులు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నారు. 

చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతం గా విమర్శించే వారు 'తెలుగు దేశం' పార్టీ అంటే 'చంద్రబాబు నాయుడు' సొంతం కాదని, అతని మీద కక్షతో పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రవర్తించినా 'కూర్చున్న కొమ్మను నరుక్కున్న' చందంగా భావించ వలసి వస్తుంది. 'తెలుగు దేశం' పార్టీ 'స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు' మానస పుత్రిక, అశేష ఆంధ్రుల 'ఆశా కిరణం'.

ఈ మధ్య సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తే, పార్టీలో కొందరు వ్యక్తులు, ముఖ్యంగా 'హరికృష్ణ ' కోటరిగా ముద్రపడిన 'జూనియర్ యన్.టి.ఆర్', వల్లభనేని వంశి, కొడాలి నాని మొదలైనన వారు 'తెలుగు దేశం' పార్టీని బలహీన పరచి, జగన్ ను సమర్ధించే విధంగా ప్రవర్తిస్తూ, తమ చేష్టల ద్వారా బహిరంగా తెలియచేస్తూ, పార్టీలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో చులకన అవుతున్నారు.

'తెలుగు దేశం' పార్టీ ఓ మహా సముద్రం లాంటిది, ఎందరో పార్టీ లోకి వస్తు పోతూ ఉన్నారు. పార్టీ ఎన్నో సంక్షోభాలు చవి చూసింది. ఎందరో సీనియర్ నాయకులు, ప్రజల్లో పలుకుబడి కలిగిన వారు పార్టీని విడిపోయారు, వారిలో కొందరు మరల తమ తప్పులను తెలుసుకుని పార్టీలోకి వచ్చారు. 

తల్లి లాంటి పార్టీ మీద అలగ వచ్చు కాని, ద్రోహం తలపెట్టకూడదు కదా? 'తెలుగు దేశం' పార్టీ తోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు పొంది, ఆర్ధికంగా బలపడి,  పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్న వారు, పార్టీకి ఆపత్కాలంలో అండదండగా ఉండవలసిన వారు, ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో ఉంటూనే, ప్రత్యర్ధులతో చేతులుకలిపి రాజకీయ వ్యభిచారం చేస్తూ, పార్టీని, పార్టీ అధ్యక్షుడిని, 'బ్లాక్ మెయిల్' చేయటం చూస్తుంటే సామాన్య కార్యకర్తకు సైతం వీరిపైన అసహ్యం కలుగుతుంది, వీరి ప్రవర్తనను పార్టీ సానుభూతి పరులు కూడా చీదరిన్చుకుంటున్నారు. 

పరిటాల రవి హత్యకు పధకం రచించింది, అతని హంతకులకు అన్ని విధాలుగా సహకరించింది వై.యస్.ఆర్, ఆయన కొడుకు వై.యస్.జగన్ అనే విషయం జగమెరిగిన సత్యమే. ఏడుకొండలవాడు ఒక రాక్షసుడిని పై లోకానికి పంపాడు, మరొకడిని త్వరలోనే కటకటాల వెనక్కు పంపే పనిలో ఉన్నాడు. 

పరిటాల రవితో అత్యంత సాన్నిహిత్యం కలిగి, అతని సినిమాలో సైతం నటించిన మోహన్ బాబు, హరికృష్ణ, వల్లభానేని వంశీ  , లాంటి వారు అతని హంతకులకు కనీసం ఆరు మైళ్ళ దూరంలో ఉండాలి, ప్రతీకారేచ్ఛతో రగిలి పోవాలి, కాని 'హరి కృష్ణ' కొడుకు 'జునియర్ యన్.టి.ఆర్, అతని అనుచరుడు, పరిటాల రవి పేరు అడ్డం పెట్టుకుని దందాలు చేసి, ఆయన మరణానంతరం ఆయనకు వీరాభిమానులుగా ఆయన ఆశయాలకు వారసులుగా  ప్రచారం చేసుకుంటున్న 'వల్లభనేని వంశీ' మొదలైన వారు ప్రస్తుతం 'జగన్' కు జై కొట్టటం, ఆయన కౌగిలిలో కరిగి పోవటం చూస్తుంటే 'పరిటాల రవి' మరణం వెనుక మరింకేవరైనా డబ్బుకు గడ్డి తినే కోవర్టుల పాత్ర ఉందా? అప్పుడు పరిటాల అనుంగు అనుచరుడే జగన్, సూరి అనుచరులతో చేతులు కలిపాడా? అనే సందేహం సగటు పరిటాల రవి అభిమానికి కలుగుతుంది.

ఈ ప్రశ్నలకు 'హరికృష్ణ', ఆయన అనుంగు అనుచరుడు 'వల్లభనేని వంశి' పరిటాల రవి అభిమానులకు బహిరంగంగా సమాధానం చెప్పి వారి సందేహాలను నివృత్తి చేయాలి, లేకుంటే వారు  అసంఖ్యాకమైన పరిటాల రవి అభిమానుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. వంశీ చర్యలను 'హరికృష్ణ' ఇంతవరకు  ఖండించ లేందంటే, వంశీ ప్రయత్నాల వెనుక ఆయన హస్తం ఉంది ఉంటుందనే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, పరిటాల రవి అభిమానులు భావిస్తున్నారు.

యన్.టి.ఆర్ మరణానంతరం తనే ఆయనకు రాజకీయ వారసుడిగా ప్రకటించుకుని గుడివాడ నుండి అసెంబ్లీ నుండి పోటి చేసి ఘోరంగా వోడిపోయి ఆ తరువాత చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని తిరిగి 'తెలుగు దేశం' పార్టీలో చేరి 'రాజ్య సభ్య' సభ్యుడి పదవి పొందిన హరికృష్ణ ప్రస్తుతం 'తెలుగు దేశం' పార్టీకి శనిలా దాపురించాడు. 

హరికృష్ణ, ఆయన అనుచరులు 'వల్లభనేని వంశీ', కొడాలి నాని వంటి చీడ పురుగులను పార్టీ నుండి వెలి వేసి, రాబోయే రెండు సంవత్సరాల కాలంలో పార్టీని కొత్త రక్తంతో, సమర్దులతో నింపి అధికారాన్ని చేజిక్కించుకొనే ప్రయత్నం చేయాలి.

'జూనియర్ యన్.టి.ఆర్ కు ముక్కు పచ్చలారని కన్య 'ప్రణీత' ను భార్యగా చేసి, వందల కోట్ల విలువైన ఆస్థికి వారసుడిగా చేసిన 'చంద్రబాబు' నాయుడికి అతను జీవితాంతం రుణపడి ఉండాలి కాని, భార్యను అడ్డంపెట్టుకుని, పిల్లనిచ్చిన మామను 'బ్లాక్ మెయిల్' చేస్తూ, 'Studio N' చానల్ ను తన ఆధీనంలోకి తెచ్చుకుని 'తెలుగు దేశం' పార్టీ, చంద్రబాబు నాయుడుకు సంభందించిన ముఖ్యమైన వార్తలను సైతం ప్రసారం చేయకపోగా, ప్రత్యర్ధి పార్టీలకు ముఖ్యంగా జగన్ లాంటి 420 గాళ్ళకు బాకా ఉదుతూ, 'నమ్మక ద్రోహానికి' మారు పేరుగా,  'ఊసరవెల్లి' అనే పదానికి నిర్వచనంగా ప్రవర్తిస్తూ 'వాపును చూసి బలుపు' అనుకుంటున్న'జూనియర్ యన్.టి.ఆర్' కు త్వరలోనే ఆయన అభిమానుల చేతనే జ్ఞానోదయం కలగాలని ఆశిద్దాం.

'దమ్ము'న్న మగాడెప్పుడు ముఖా ముఖి తలపడతాడు కానీ, కొజ్జా వెధవలాగా వెనుక నుండి దెబ్బతీసే ప్రయత్నం చేయడు. వీళ్ళు  'జగన్' జపం చేసినా, వై.యస్. కీర్తనలు పాడినా 'తెలుగు దేశం పార్టీ నుండి బయటకు వెళ్లి చేస్తే బాగుంటుంది. 'తిన్న ఇంటికే కన్నాలు వేసే' ఇలాంటి చిల్లర గాళ్ళ తో పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. వెంటనే వీరిని పార్టీ నుండి బహిష్కరించాలి.

'జై తెలుగు దేశం', 'జై నందమూరి తారక రామారావు', 'జై పరిటాల రవి'.
Post a Comment