Monday, January 28, 2008

'Gundaism' Down Down!

హీరో రాజశేఖర్ పై కొందరు 'గూండా అభిమానులు' జరిపిన అమానుష దాడిని ఖండించండి. నిన్న రాత్రి భీమవరం లో జరిగిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న హీరో రాజశేఖర్, విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, 'తాను చిరంజీవి పెట్టబోయే పార్టీలో చేరే ప్రసక్తి లేదని, చిరంజీవికి రాజకీయ అనుభవం లేదని' చెప్పారు.

ఈ వ్యాఖ్యలో తప్పుకాని, విమర్శ కాని ఏమి లేదు. చిరంజీవి గురించి కాని, అతని కుటుంబం గురించి కాని, చిరంజీవి పెట్టబోయే రాజకీయ పార్టీ గురించిన వ్యాఖ్యలేమి లేవు. కాని ఇదేదో తప్పుడు వ్యాఖ్య లాగా కలర్ ఇచ్చి కొన్ని TV9, NTV లాంటి ఎల్లో ఛానల్స్, స్క్క్రోలింగ్ లో చూపిస్తూ గూండా ఫాన్స్ ను రెచ్చగోట్టాయి. బూతు వార్తలు, అప్రధాన్య వార్తలకు అధిక ప్రాధాన్యమిచ్చే, TV9 వాళ్ళు, రాక్షసానందం తో గూండా ఫాన్స్ ను వెంట తీసుకెళ్ళి, నర్సాపూర్ ట్రెయిన్ లో హైదరాబాద్ వస్తున్నరాజశేఖర్ పై దాడి చేసే దృశ్యాలను చిత్రీకరించి మరల హైదరాబాద్ స్టేషన్ లో ట్రెయిన్ దిగి కారులో వస్తున్న రాజశేఖర్ కుటుంబం పై 'గూండా ఫాన్స్' చేసే దాడిని కుడా చిత్రీకరించి, రాజశేఖర్ తప్పు చేసినవాడు దొంగ చాటుగా పారిపోఇనట్లు గా స్క్రోల్లింగ్ లో చూపించి అగ్నికి ఆజ్యం పోశారు.

తెల్లారిందొలేదో, TV9 వాళ్ళు పని, పాటలేని కొందరు పోరంబోకు ఫాన్స్ చేసే దూషనలను లైవ్ కవర్ చేస్తూ, ఓవర్ ఆక్షన్ చేసారు. 'గోపాల్ రెడ్డి' లాంటి కొందరు పనికిమాలిన వాళ్ళు తనకు మాలిన విషయాలలో తలదూర్చి 'తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని 'రాజశేఖర్' చిరంజీవిని విమర్సించటం ఏమిటి అని, 'గూండా ఫాన్స్' అధ్యక్షులు అని చెప్పుకొనే కొందరు లుచ్చాలు రాజశేఖర్ స్థాయి ఏమిటి? అని విమర్శలు సంధించారు.

నిజమే! రాజశేఖర్ తెలుగు సరిగా రాకున్నా, కష్టపడి తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు, కాని కొందరిలాగా వచ్చి, రాని బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడు. నిజమే! రాజశేఖర్, చిరంజీవి లాగ గొప్ప డిగ్రీలు చదువుకోలేదు, ఏదో 'డాక్టర్' చేసాడన్తే! రాజశేఖర్ తండ్రి చిరంజీవి తండ్రిలాగా గొప్ప'క్లర్క్' కాదు కాని, ఏదో ఒక చిన్న పోలీసు ఆఫీసర్. రాజశేఖర్, చిరంజీవిలాగా గొప్ప చిన్న చిన్న వేషాలు వేసి సినిమా రంగంలోకి రాలేదు, ఏదో చిన్నహీరో లాగానే సినిమాలలోకి వచ్చాడు. కమ్మవాడైన రాజశేఖర్ తనను ప్రేమించిన జీవిత (కాపు/బలిజ) ను కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నాడు, కాని మోసం చేసి వదిలేయలేదు, రెండో సెటప్ పెట్టి వివాహ వ్యవస్థను అపహాస్యం చేసి, తన అభిమానులకు తప్పుడు మార్గం చూపించలేదు. నిజంగానే, రాజశేఖర్ కి చిరంజీవి ఫామిలికి ఉన్నంత స్థాయి లేదు.

రాజశేఖర్ కుటుంబం పైన 'రాక్షసంగా' దాడిచేసిన 'గూండా తమ్ముళ్ళు' అదేదో గొప్పపని చేసాం అన్నట్లు గా 'రాజశేఖర్' అంతు చేస్తామంటూ వార్నింగులు ఇచ్చారు. చిరంజీవి గురించి చిన్న కామెంట్ చేసేవారిని ఎవ్వరినైనా వదలమని 'గూండా తమ్ముడి గారి' మాటగా వల్లించారు. రాజశేఖర్ అన్న దాంట్లో తప్పేమీ లేదు, నిజంగానే చిరంజీవికి రాజకీయానుభవం లేదు. ప్రతి వాళ్ళు తనకిష్టమైన పార్టీలో చేరే స్వేచ్చ ఉంది, కాని చిరంజీవి 'గూండా తమ్ముళ్ళు' మాత్రం అందరూ, చిరంజీవి పార్టీ లోనే చేరాలని, లేని వాళ్లను ఏదో చేస్తామని బెదిరించటం చూస్తే చిరంజీవి పెట్టబోయే పార్టీలో కార్యకర్తలు ఎంత నేర స్వభావం కలవారో అర్ధమవుతుంది.

ఇంకా పెట్టని చిరంజీవి పార్టీలో ప్రస్తుతం చురుగ్గా పనిచేసే వాళ్ళు నిజమైన ఫాన్స్ కాదు. వాళ్ళ ముసుగులో 1989 లో విజయవాడ లో ఒక గూండా MLA హత్య అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో రాష్ట్రాన్ని అగ్ని గుండం చేసిన 'గూండాలు, కిరాయి రౌడి లు' ఖైదీలు, మోసగాళ్ళు, రాక్షసులు, కిరాతకులు ప్రస్తుతం మరల 'ఆంధ్ర ప్రదేశ్' లో 'గూండా రాజ్యం' కి అంకురార్పణ కావించాలని చూస్తున్నారు.

చిరంజీవి ఫాన్స్ చేసే ఏవైనా మంచి పనులకి అతనే ఆదర్శం అని చెప్పుకోనేటప్పుడు, వాళ్ళు చేసే తప్పుడు పనులకు కూడా చిరంజీవే బాధ్యత వహించాలి. ఫాన్స్ చేసే ప్రతి అడ్డమైన పనికి లోపల మద్దతిచ్చి, పైకి మాత్రం వాళ్ళు నా ఫాన్స్ కాదు, పొరపాటు జరిగింది అని తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన చిరంజీవి గోప్పవాడై పోడు. చిరంజీవి నిజంగా పార్టీ పెట్టిన రోజు, అతను ఇతర పార్టీలను విమర్శించిన రోజు, ఆ పార్టీ నాయకులే చిరంజీవి, అతని కుటుంబం యొక్క గుట్టు, అతను మద్దతిచ్చే గుండాల వివరాలు బయటపెడతారు. 'తెల్ల రంగేసుకున్నంత మాత్రాన కాకి పావురమైపోతుందా?' ప్రజలు నిజం తెలుసుకొనే రోజు దగ్గరి కొచ్చింది.

'గూండా తమ్ముళ్ళు' ప్రజలని బెదిరిస్తూ, భయోత్పాతం సృష్టించాలని 'రాక్షస రాజ్యం' స్థాపించాలని చూస్తుంటే పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం చుస్తూ కుర్చోవు. ప్రజలు తిరగబడతారు, మేక వన్నె పులులకు బుద్ధి చెబుతారు.
Post a Comment