Monday, December 31, 2007

Political injustice to Kammas in AP

ఈ ప్రభుత్వం ప్రవచించే సామాజిక న్యాయం అంటే, కమ్మవారిని పదవులకు దూరంగా ఉంచటమేనా? గుంటూరు జిల్లాలో జనాభా పరంగా మరియు యం.యల్.ఏ ల సంఖ్య లోను ఎక్కువగా ఉన్న కమ్మవారికి రాజకీయ పదవులలో దక్కిన వాటా ఎంత? ఆరుగురు యం.యల్.ఏ లు ఉన్నామంత్రివర్గంలో ఒక్క పదవీ దక్కలేదు. కమ్మవారు అధికంగా ఉన్నా జిల్లాలన్నీ రిజర్వేషన్ కిందకు తీసుకువెళ్ళారు. గతంలో కనీసం ఇద్దరు, ముగ్గురు తక్కువ కాకుండా కమ్మ జిల్లా పరిషత్ ఛైర్మన్ లు ఉండేవారు. ప్రస్తుతం ఒక్క కమ్మ జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా లేకపోవటం బాధాకరం. గుంటూరు మున్సిపల్ కార్పరేషన్లో, విజయవాడ మున్సిపల్ కార్పరేషన్లో కమ్మ కార్పరేటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా, మేయర్ పదవికి దూరంగా ఉంచారు. దీనికి కారణం నెల్లూరు నుండి విజయవాడకు దిగుమతి చేసుకుని ఎం.పి గా గెలిపించుకున్న లగడపాటి రాజగోపాల్. విజయవాడలో కమ్మవారికి కనీసం డిప్యూటీ మేయర్ పదవి దక్కింది కాని, గుంటూరులో మాత్రం ఏపదవి దక్కలేదు. కమ్మవారికి రాజకీయంగా అన్యాయం జరుగుతుందని కమ్మ సంఘాల సమావేశాలలో బాధపడిన రాయపాటి సాంబశివరావు తన తమ్ముడికి యం.యల్.సి పదవి ఇప్పించుకుని, తన కొడుకుకి మేయర్ పదవికి హామీ పొంది తనవారికి న్యాయం చేసుకుని కమ్మకులానికి అన్యాయం చేసాడు. గుంటూరు జిల్లాలో కమ్మవారు అంటే రాయపాటి కుటుంబం ఒక్కటే కాదు. కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా గుంటూరు జిల్లాలో రాయకీయ పదవులలో కమ్మవారికి గత దశాబ్ద కాలంగా అన్యాయం జరుగుతూనే ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ అన్యాయం మరీ ఎక్కువైంది, కొంతమంది కమ్మ నాయకుల స్వార్ధం, మనలో అనైక్యతే ఇందుకు కారణం. కమ్మవారి ఓట్లతో గెలిచి స్వంత ప్రయోజనాలు కాపాడుకొనే రాయపాటి, లగడపాటి, దేవినేని నెహ్రు లాంటి వ్యక్తులు ఉన్నంత కాలం మనకులానికి న్యాయం జరగదు. వచ్చే ఎలక్షన్లలో మనం ఆలోచించి మన ప్రతినిధులని ఎన్నుకుంటేనే మన వాణిని బలంగా వినిపించగలం.
Post a Comment